ప్రజా సమస్యల పరిష్కారానికి సంఘటితంగా కృషి చేయాలి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వ వాతావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి పౌరుడు బాధ్యతతో వ్యవహరించాలని సద్భావన ఫోరమ్ సభ్యులు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో సద్భావన ఫోరమ్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సమావేశంలో సమాజ సామరస్యం, ప్రజా హక్కులు, పౌర బాధ్యతలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఇటీవల ఆర్మూర్‌లో ఓ ఉపాధ్యాయుడిపై జరిగిన దాడి ఘటనను ప్రస్తావిస్తూ, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సమాజంలోని అన్ని వర్గాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చట్టాన్ని గౌరవిస్తూ సమస్యలను శాంతియుత...