Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 July 2026, 6:30 pm Posted by : ramakrishna

దొడ్డికొమరయ్య స్ఫూర్తితో పోరాటం చేయాలి

 

. . . సిపిఐ (ఎం ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ

 

సిరికొండ, బతుకమ్మ :

 

తెలంగాణ సాయుధ రైతంగా పోరాటంలో తొలి అమరడు దొడ్డికొమరయ్య స్ఫూర్తితో పోరాటం చేయాలని సిపిఐ (ఎం ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి.రామకృష్ణ పిలుపునిచ్చారు. మండలంలోని గడ్కోల్ గ్రామంలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతిని ఘనంగా నిర్వహించి, దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి, రెండు నిముషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా  రామకృష్ణ మాట్లాడుతూ బానిసత్వం, భూమి కోసం, భుక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కామ్రేడ్ దొడ్డి కొమరయ్య ముందు భాగంలో నిలిచి పోరాడిన వీర యోధుడన్నారు. ఈ సమరంలో 4వేల మంది అమరులు అయ్యారని, 3వేల గ్రామాలు విముక్తి అయ్యాయని, 10లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన ఈ గొప్ప కమ్యూనిస్ట్ ఉద్యమం లో కొమరయ్య ముందు భాగంలో నిలిచాడన్నారు. దొడ్డికొమరయ్య అమరత్వం స్ఫూర్తితో సాయుధ రైతాంగ పోరాటం మరింత ఉదృతం అయిందని, భూమి పోరాటం లో గుత్పల సంఘము పెట్టి ప్రజల్ని కూడా చైతన్యం చేసి పోరాడిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీదన్నారు. కొందరు మతవాదులు విశాలమైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని వక్రీకరించి మత ఘర్షణల పోరాటంగా చిత్రీకరించే కుట్రలకు పునుకుంటుందన్నారు. వారి కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని, కామ్రేడ్ దొడ్డికొమరయ్య స్ఫూర్తిని చాటడమంటే బలమైన పోరాటాలను చేపట్టి, ఉద్యమాలను నిర్మించడమేనన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం ఎల్) మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్.రమేష్ అధ్యక్షత వహించగ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, ఎం సాయరెడ్డి, బి బాబన్న, బి కిశోర్, ఎం అనీష్, మండల నాయకులు ఎస్ కిశోర్, జి బాల్ రెడ్డి, జి ఎర్రన్న, ఒ ఆశన్న తదితరులు పాల్గొన్నారు.