Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 7:19 pm Posted by : ramakrishna

దేశ ఐక్యత, సమగ్రత కోసం పాటు పడాలి

 

. . . ప్రతి ఒక్కరు పూర్తి వందేమాతరం ఆలపించాలి

 

. . . పలు చోట్ల త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రతి ఒక్కరు దేశ ఐక్యత, సమగ్రత కోసం పాటుపడాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని పలు అసోసియేషన్లు కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం తొలిసారి పూర్తి వందేమాతరం గీతాన్ని పాడాలని చట్టం తీసుకురావడం మంచి పరిణామం అన్నారు. ఇకపై ఎక్కడైతే జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారో అక్కడ పూర్తి వందేమాతరం ఆలపించాలని కోరారు. స్వాతంత్ర సమరయోధుల పోరాట స్ఫూర్తితో దేశభక్తిని పెంపొందించుకోవాలన్నారు.

 

We must strive for the unity and integrity of the country.

 

ఆనాటి అమరుల త్యాగాల వల్లే స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని పేర్కొ న్నారు. 2047 వరకు వికసిత్ భారత్ సాధించేందుకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. జాతీయ సమైక్యత, దేశ భద్రత, స్వదేశీ ఆత్మ విశ్వాసం దిశగా ముందుకు సాగాలన్నారు. మొదటగా బస్ స్టాండ్ ఆవరణలోని ఆటో స్టాండ్ అసోసియేషన్, అనంతరం లలిత కాంప్లెక్స్లోని మొబైల్ షాప్స్ అసోసియేషన్, అనంతరం క్యాంపు కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే సన్ రైజ్ హాస్పిటల్ లో జాతీయ జెండాను ఎగుర వేశారు. బీజేపీ జిల్లా కార్యాలయం, కార్పొరేషన్ కార్యాలయంలో, పరేడ్ మైదానంలో జరిగిన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో బీజేపీ కార్పోరేటర్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

 

We must strive for the unity and integrity of the country.