- బీజేపీ కానిస్టెన్సీ కన్వీనర్ మల్కన్నగారి మోహన్ రెడ్డి
భీమ్ గల్, బతుకమ్మ : మండలంలో బీజేపీ పార్టీ బలంగా ఉందని, ఈ తరుణంలోనూతంగా ఎన్నికైన మండల కార్యవర్గం కృషి చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చాతాలని బీజీపీ కానిస్టెన్సీ కన్వీనర్ మల్కాన్నగారి మోహన్ రెడ్డి సూచించారు. సోమవారం మండల కేంద్రం లోని ఎల్. జె ఫంక్షన్ హాల్లో జరిగిన మండల కార్యవర్గ ఎన్నిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన ఆయన పార్టీ బలోపేతానికి హర్నిశలు పని చేయాలని తెలిపారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటీసీ ఎన్నికల్లో కష్టపడి పని చేసి అందరిని గెలిపించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో మండల పార్టీ ప్రెసిడెంట్ మూలిగే మహిపాల్, కిసాన్ మోర్చా ప్రెసిడెంట్ తోట గంగాధర్, మాజీ ఎంపీటీసీ అరే రవీందర్, బీజేపీ నాయకులు లింబాద్రి నాయక్, సీ. హెచ్ రాజేశ్వర్, ఈర్ల మహేందర్, ఓరుగంటి కిషన్, కోడిగేల శ్రీనివాస్, బడా భీమ్ గల్ లింగం, వాల్గొట్ బాపూరావు, ఖంటం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.