Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 September 2025, 4:52 pm Posted by : ramakrishna

స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటాలి : కొండా  ఆశన్న

బతుకమ్మ, కోటగిరి : రానున్న స్థానిక ఎన్నికలలో తమ సత్తా చాటి జడ్పీ చైర్ పర్సన్ పదవిని  కైవసం తీసుకోవాలని దిశా కమిటీ మెంబర్ బిజెపి జిల్లా నాయకులు కొండా ఆశన్న అన్నారు. కోటగిరి మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు ఎముల నవీన్ ఆధ్వర్యంలో  మండల ఎన్నిక సన్నాహక సమావేశంలో  ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వచ్చే నెల జడ్పిటిసి ఎంపీటీసీల ఎలక్షన్  ఖరారు అయినా సందర్బంగా పార్టీ అధిష్టానం ఆదేశానుసారం  అన్ని స్థానాల్లో బిజెపి అభ్యర్థుల బరిలో ఉండి ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేసి  అధికారాన్ని చేజెక్కించుకునే  విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని ఆయన సూచించారు. రానున్న రోజులలో తెలంగాణ గడ్డ పైన బీజేపీ పార్టీ అధికారంలో వస్తుందని  ఆయన అన్నారు. పార్టీ నిర్దేశించిన వ్యక్తులకు కోసం పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసే  గెలుపు దిశగా అడుగులు వేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు  హౌగిర్రావ్ దేశాయ్, పుల్లల మోహన్, శ్యామల,  మామిడి శ్రీనివాస్, రెడ్డి రాజు, కొత్తపల్లి సాయికుమార్, వడ్ల శ్యామ్, ఎల్లుట్ల గజేందర్, నాగరాజు,విలాస్ రావు, విటల్,మోహన్, భాస్కర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.