మహనీయుల త్యాగాల స్ఫూర్తితో దేశ సమైక్యతను కాపాడాలి

  . . . విశ్రాంత ప్రధానోపాధ్యాయులు దాసరి విజయానందరావు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని దేశ సమైక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విశ్రాంత ప్రధానోపాధ్యాయులు దాసరి విజయానందరావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ-కన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్. సిద్దయ్య, ప్రిన్సిపాల్ జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య...