- విద్యార్థి సంఘాల నాయకుల పిలుపు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అనుమతులేని కోచింగ్ సెంటర్లపై సమైక్య పోరాటానికి సిద్ధం కావాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.నిజామాబాద్ నగరంలోనీ కార్యాలయంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) ఆధ్వర్యంలో అనుమతి లేని కోచింగ్ సెంటర్లు వాటి ప్రక్షాళన కై విద్యార్థి సంఘాల కార్యాచరణ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత ఏఐఎస్ఏ రాష్ట ప్రధాన కార్యదర్శి కిరణ్ వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలో లక్షల్లో వేళల్లో ఫీజులు వసూలు చేస్తూ కనీస అర్హతలు లేకుండా, ఎలాంటి రక్షణ లేకుండా, అధికారుల అనుమతులు లేకుండా కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వానికి ఎలాంటి పనులు చెల్లించకుండా ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా ఐఐటి, నీట్, జేఈఈ, అడ్వాన్స్ 8,9,10 క్లాస్ లంటో, నవోదయ, గురుకుల, గ్రూప్ కోచింగ్ లంటు, అడ్వాన్స్ ఇంటర్మీడియట్ బ్రిడ్జి కోర్సులు అంటూ , సబ్జెక్టు ట్యూషన్ లంటూ వేలల్లో వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంటింటికి తిరుగుతూ వివరాలు సేకరిస్తూ తల్లిదండ్రులని మభ్యపెడుతూ మీ పిల్లల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతామని చెప్పి ఫోన్ నెంబర్లు తీసుకొని జాయిన్ అయ్యే వరకు వాళ్లకు ఆశలు కల్పిస్తూ అడ్మిషన్లు చేసుకుంటూ లక్షల్లో డబ్బులు తీసుకుంటున్నారన్నారు. ఇలాంటి కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్, యుఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి మహేష్, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
