Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 June 2025, 9:26 pm Posted by : ramakrishna

మనో సంకల్పంతో అంగవైకల్యాన్ని జయించాలి

  • అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో న్యూ అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన వికలాంగుల బడి బాట కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా  అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ  హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతు వికలాంగుల బడి బాట కార్యక్రమంతో అంగవైకల్యం  ఉన్న విద్యార్థులలో, తల్లితండ్రులలో మనో శక్తి పెంపొందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న స్నేహ సొసైటీ వారిని అభినందించారు. శరీరానికి ఉన్న అంగవైకల్యాన్ని  మనో సంకల్పంతో జయించి విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగలన్నారు. విద్య ఒక్కటే విద్యార్థుల జీవితాలను తీర్చి దిద్దుతుందని వెల్లడించారు. విద్యతో పాటు వివిధ రంగాలలో ఉన్నత శిఖరాలను సాధించిన సుధా చంద్రన్, లూయి బ్రెయిల్ వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడి అంగవైకల్యం ఉన్న విద్యార్థులకు సదరం క్యాంపు ఏర్పాటు చేసి వారికీ సర్టిఫికెట్ అందేల చూస్తానని  దాని ద్వారా దివ్యాంగులు ప్రభుత్వ పథకాలు, రాయితీల ప్రయోజనాలను పొందవచ్చు అని అన్నారు. ప్రభుత్వం నుండి, తన సొంత ట్రస్ట్ ద్వారా ఎల్లప్పుడూ సహాయాసహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ చైర్మన్ సిద్దయ, ప్రిన్సిపల్ జోతి ,సీడీపీఓ సౌందర్య,స్నేహ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ వీరేషం,ల్ పీసీ చైర్మన్ బాబా గౌడ్ , వైస్ చైర్మన్ జీవన్ రావు, ఆర్ ఎం ఓ డాక్టర్ హుమేర బేగం,తదితరులు పాల్గొన్నారు.

We must overcome disability with determination.