Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 August 2025, 6:13 pm Posted by : ramakrishna

ఉద్యోగుల హక్కుల కోసం సమిష్టిగా పోరాడాలి

  • ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్

 

ఆర్మూర్, బతుకమ్మ : ఉద్యోగుల హక్కుల కోసం సమిష్టిగా పోరాడాలని ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ అన్నారు. ఎస్ఆర్ఎస్పీ, భీంగల్ యూనిట్ కార్యవర్గ సమావేశం ఆర్మూర్ యూనిట్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.  ఉద్యోగుల హక్కుల సాధన కొరకై రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు చర్చలు జరిపినప్పటికీ సమస్యల పరిష్కారానికి పోరాడాలని తెలిపారు  206 సంఘాల భాగస్వామ్య సంఘాలతో ఏర్పడిన ఉద్యోగ జేఎసి సమక్షంలో టీఎన్జీవో కేంద్ర కార్యాలయం నందు ఏర్పాటుచేసిన ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నందు అఖిలభారత ఉద్యోగుల సమైక్య జాతీయ అధ్యక్షులు, ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్, టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఎస్ఎం.హుస్సేని (ముజీబ్), ఇతర రాష్ట్ర జేఏసీ నాయకుల సమక్షంలో రాష్ట్ర జేఏసీ సమావేశం నందు సుదీర్ఘంగా చర్చలు జరిపారని తెలిపారు.  అనంతరం ఉద్యోగుల హక్కుల సాధన కొరకై జంగ్ సైరన్ మోగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ ఉద్యమ కార్యాచరణను తెలుపుతూ… సెప్టెంబర్ 1వ తేదీని పెన్షన్ విద్రోహదినం గా భావించి, ఆరోజున ఆయా జిల్లాల ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలలో ఐడీఓసీ కార్యాలయల ముందు, నల్ల బ్యాడ్జీలు ధరించి, నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.  అనంతరం హైదరాబాద్ లలిత కళాతోరణం నందు రాష్ట్ర ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సీపీఎస్ అంతం కొరకు ఏర్పాటుచేసిన ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి తరలి రావాలని పిలుపునిచ్చారు.  ఈ సమావేశానికి టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, నిజామాబాద్ అర్బన్ యూనిట్ అధ్యక్షులు జాకీర్ హుస్సేన్, ఆర్మూర్ యూనిట్ అధ్యక్షులు శశికాంత్ రెడ్డి, ఎస్ఆర్ఎస్పీ యూనిట్ కార్యదర్శి సాయి కృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు సునీల్ కుమార్, టీఎన్జీవో ముఖ్య సలహాదారులు వనమాల సుధాకర్, ఇరు యూనిట్ల కార్యవర్గ సభ్యులు ఉద్యోగులు పాల్గొన్నారు.

We must fight collectively for employees' rights.