Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 4:53 pm Posted by : ramakrishna

పోలీయో రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలి

 

. . . 21 వ డివిజన్ కార్పొరేటర్ పంచ రెడ్డి లలితా చరణ్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కార్పొరేటర్ పంచ రెడ్డి లలితా చరణ్ అన్నారు. ఆదివారం 21 వ డివిజన్ లో కార్పొరేటర్ పంచ రెడ్డి లలితా చరణ్, అంగన్వాడి ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి తో కలిసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పోలియో అనేది చిన్నపిల్లలను శాశ్వత వికలాంగులుగా మార్చే ప్రమాదకర వైరస్ వ్యాధి అని దీనికి పూర్తి చికిత్స లేదని అన్నారు. అయితే పోలియో చుక్కల ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని, “చికిత్స కంటే నివారణే మేలు” అనే సందేశంతో ప్రతి తల్లిదండ్రులు తమ ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు ప్రతి పోలియో కార్యక్రమంలో తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో అన్ని ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రత్యేక పోలియో బూత్‌లలో ఉచితంగా పోలియో చుక్కలు అందుబాటులో ఉంటాయని పిల్లలకు గతంలో పోలియో చుక్కలు వేసినా, ప్రతి పల్స్ పోలియో కార్యక్రమంలో మళ్లీ వేయించడం సురక్షితమని తెలిపారు. పిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రతి తల్లిదండ్రులు పోలియో కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ ఆరోగ్య శాఖ  సంక్షేమ శాఖ అధికారులు, అంగన్వాడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.