చింతల్ నాగారం లిఫ్ట్ ఇరిగేషన్ ను పరిశీలించిన పోచారం
బాన్సువాడ, బతుకమ్మ : చింతల్ నాగారం లిఫ్ట్ ఇరిగేషన్ చివరి ఆయకట్టు వరకు నీరు అందటం లేదని రైతుల అభ్యర్థన మేరకు చింతల్ నాగారం లిఫ్ట్ ఇరిగేషన్ ను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. పైప్ లైన్ లీకేజీ వలన చివరి ఆయకట్టు వరకు నీరు అందటం లేదని సంబంధిత అధికారులకు,నిర్వాహకులకు పైప్ లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయానికి సాగునీరు అవసరాల కొరకు మంజీరాలో చెక్ డ్యాం...