Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 August 2025, 9:13 pm Posted by : ramakrishna

చింతల్ నాగారం లిఫ్ట్ ఇరిగేషన్ ను పరిశీలించిన పోచారం

బాన్సువాడ, బతుకమ్మ : చింతల్ నాగారం లిఫ్ట్ ఇరిగేషన్ చివరి ఆయకట్టు వరకు నీరు అందటం లేదని రైతుల అభ్యర్థన మేరకు చింతల్ నాగారం లిఫ్ట్ ఇరిగేషన్ ను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. పైప్ లైన్ లీకేజీ వలన చివరి ఆయకట్టు వరకు నీరు అందటం లేదని సంబంధిత అధికారులకు,నిర్వాహకులకు పైప్ లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయానికి  సాగునీరు అవసరాల కొరకు మంజీరాలో చెక్ డ్యాం నిర్మించుకున్న సందర్భంగా మంజీరాలో  పుష్కలంగా  నీరు ఉన్న కానీ పైపు లైను లీకేజీ వలన పంటలకు సాగు నీరు అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి, కావున పైప్ లైన్ లీకేజీలు తొందరగా పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని తెలిపారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలోని పంటలు నీరు అందక ఎండుతున్న సందర్భంగా మంగళవారం నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి నీరు విడుదల చేసి పంటలను రక్షించాలి అని సీఈ  శ్రీనివాస్ ని ఆదేశించారు.

We inspected and irrigated the lift irrigation system in Chintal Nagaram.