గ్రామాభివృద్ధికి కోటి రూపాయల నిధుల మంజూరు చేశాం
రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి నిజామాబాద్ రూరల్, బతుకమ్మ: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని రూరల్ మండలం సారంగాపూర్ గ్రామంలో శుక్రవారం జరిగిన శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “గ్రామస్థులు ఐకమత్యంతో హనుమాన్ ఆలయ నిర్మాణం చేపట్టిన తీరు అభినందనీయమైనది” అని అన్నారు. అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో గ్రామ ప్రజలు ఆయుష్షు, ఆరోగ్యం, సుఖశాంతులతో ఉండాలన్నారు. మందిర నిర్మాణానికి కావలసిన ఇసుకను స్థానికులు కోరిన...