సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నా ప్రచారంలో వెనకబడ్డాం
నిజామాబాద్ జిల్లా అంటేనే వ్యవసాయం జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తా జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క నిజామాబాద్, బతుకమ్మ : ఎన్నడూ జరగని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నా ప్రచారంలో వెనకబడ్డామని జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క అన్నారు. పార్లమెంటరీ స్థాయి కాంగ్రెస్ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా అంటేనే వ్యవసాయమని అన్నారు. రాష్ట్రంలో అందరి కంటే ముందే వరి నాట్లు నాటుతారని తెలిపారు. ఈ జిల్లాకు ఇంచార్జ్ మంత్రి కావటం...