Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 August 2025, 5:55 pm Posted by : ramakrishna

పోరాటాల ఫలితంగా మనకు స్వేచ్ఛ లభించింది

  • బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు జగన్ మోహన్ గౌడ్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూరు శాఖ  ఆధ్వర్యంలో కార్గిల్ చౌరస్తాలో స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.  ఈ కార్యక్రమంలో  నిజామాబాద్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు జగన్ మోహన్ గౌడ్  పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ…  దేశంలో ఎందరో పోరాటాల ఫలితంగా మనకు స్వేచ్ఛ లభించింది మన స్వతంత్రం కేవలం ఒకరోజు వేడుక మాత్రమే కాదు ఇది మనపై ఉన్న బాధ్యత మన దేశ అభివృద్ధి పథంలో నడిపించడంలో సమాజంలో ఐక్యత శాంతి మరియు సమానత్వం కాపాడటం యువత పాత్ర ఎంతో గొప్పది మరియు మన దేశాన్ని అగ్రస్థానంలో ఉంచాలంటే అది యువత భుజాలపైన బాధ్యతగా తీసుకొని దేశం విషయంలో అందరు కూడా జాతీయ భావజాలంతో ముందుకు పోవాలని ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాల వల్ల ఈరోజు ఈ స్వతంత్రం మనం సాధించుకున్నాము. అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పండుగలాగా జరుపుకుంటూ ప్రతి ఒక్క దేశ పౌరులు జరుపుకోవాలని కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఇందూరు విభాగ్ కన్వీనర్ కైరి శశిoధర్, కంటేశ్వర్ జోనల్ ఇన్చార్జ్ దుర్గా దాస్, ప్రణీత్ , లక్కీ, సన్నీ తేజ నవీన్ రాకేష్ రమేష్ వంశీ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

We gained freedom as a result of struggles