Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 February 2026, 5:05 pm Posted by : ramakrishna

పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షులు కర్క గణేష్ అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం

 

. . . పీడీఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే అషూర్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ కర్క గణేష్ ను సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా రూరల్ పోలీసులు ఇంటివద్ద అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారని, ఈ అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని పీడీఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే అషూర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందస్తు పేరిట అరెస్టు చేయడాన్ని నిరసిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తే అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. తెలంగాణ యూనివర్సిటీ కి 200 కోట్లు కేటాయించాలని, సైన్స్ కళాశాల భవనాన్ని విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని, యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని అడిగితే అరెస్టు చేయడం సరికాదన్నారు. స్కాలర్షిప్, ఫీజ్ రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తే అరెస్టులా… పోలీసుల, ప్రభుత్వాల ఈ అప్రజాస్వామిక చర్యలను ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని పిలుపునిచ్చారు.