రిజర్వేషన్ల రద్దు కుట్రను ఖండిస్తున్నాం

నిజామాబాద్, బతుకమ్మ: మాల, మాదిగలను విడదీసి రిజర్వేషన్లను రద్దు చేసేందుకు చేస్తున్న కుట్రలను ఖండిస్తున్నామని, సుప్రీం కోర్టు తీర్పు ఆర్టికల్ 341కి వ్యతిరేకమని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వీనర్ గైని గంగారాం, మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు సక్కి విజయ్ కుమార్ అన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో సోమవారం వారు విలేకరులతో మాట్లాడారు.  సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో నిర్వహించిన మాల సింహ గర్జనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రిజర్వేషన్లు రూపుమాపాలనుకునే  పార్టీలకు, నాయకులకు భవిష్యత్...