మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ లో ఇటీవలే ఒక వర్గంను టార్గెట్ చేస్తూ ఒక వర్గానికి చెందిన 40 మంది కలిసి పక్క ప్లాన్ ప్రకారం వాహనానికి బైక్ అడ్డం పెట్టి అడ్డుకొని ఇనుప రాడ్డుతో కర్రలతో ఒంటరిగా ఉన్న వ్యక్తిని నడి రోడ్డుపై దాడి చేసినారు. చితకభాది అతని పై బుల్లెట్ బైక్ ని నడిపించి కాలు విరగకోట్టారు. ఇట్టి దాడి పూర్తిగా ఒక వర్గంపై జరిగిన దాడి ఇట్టి దాడిని మేము హిందూ యువజన సంఘాలు ఖండిస్తున్నాయని అన్నారు. పోలీస్ యత్రాంగం కేవలం 6 గురిపై మాత్రమే కేసు వేసినారు. మిగతా 34 మందిని ఇప్పటికి గుర్తించి వారిపై కేసు వేయలేదు. అందులో కొందరిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇట్టి దాడికి పాల్పడ్డ వారిలో 40 మంది దాడి చేస్తే కేవలం ఆరు గురిపై మాత్రమే కేసు వేసినారు. పోలీస్ యత్రాంగం నిర్లక్షానికి స్పష్టం అవుతుందని ఇది పూర్తిగా రాజ్యాంగానికి వ్యతిరేకం, సిగ్గుచేటు విషయం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శివానంద్, పుప్పాల నరేష్, శ్రీకాంత్, రమేష్ రెడ్డి, జైడి గంగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సంతోష్, చిన్నరెడ్డి, అనిల్, సాగర్, మురళి, నర్సయ్య, మోహన్, గంగారెడ్డి, రాజారెడ్డి, సవీన్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
- సురేష్ ను పరామర్శించిన మల్లికార్జున్..
మోర్తాడ్ గ్రామానికి చెందిన రొయ్యల సురేష్ ఆర్మూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని శనివారం బిజెపి బాల్కొండ నియోజకవర్గం ఇన్చార్జి మల్లికార్జున్ రెడ్డి ఆయనను పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి సురేష్ ఆరోగ్య విషయాలను ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పుప్పాల నరేష్, శివనంద్ తదితరులు పాల్గొన్నారు.
