. . . పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
జార్ఖండ్ రాజధాని రాంచీలో ఏఐఎస్ఏ జాతీయ అధ్యక్షురాలు కామ్రేడ్ నేహా బోరాపై కొందరు దాడికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ తెలిపారు. జార్ఖండ్‌లో జేపీఎస్‌సీ, జేఎస్‌ఎస్‌సీ – సీజీఎల్ తదితర నియామక పరీక్షల్లో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాంచీలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో నేహా బోరా పాల్గొన్నారని ఆయన తెలిపారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు ఆమెపై ఇంక్ చల్లారని పేర్కొన్నారు. ఈ ఘటనను ఖండిస్తూ రాజేశ్వర్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్య దేశంలో విద్యార్థులు, యువజన నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం, ప్రజా సమస్యలపై ఉద్యమించడం వారి హక్కు అని అన్నారు. ఆ హక్కులను అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారిపై దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నా రు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, దాడికి పాల్పడిన వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ డిమాండ్ చేస్తుందని జన్నారపు రాజేశ్వర్ తెలిపారు.