Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 May 2025, 5:02 pm Posted by : ramakrishna

మీడియా మిత్రులపై దాడిని ఖండిస్తున్నాం

  • బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ యాదవ్

 

బతుకమ్మ బోధన్: బోధన్ పట్టణంలో శనివారం బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ నేతృత్వంలో తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించబడింది. ఖండ్గావ్, సిద్దాపూర్‌లో జరిగిన ఇసుక మాఫియాను మీడియా వెలుగులోకి తీసుకురావడంతో, కొందరు అక్రమ ఇసుకాసురులు మీడియా మిత్రుల దిష్టిబొమ్మను దగ్ధం చేసి, అసభ్యకరంగా వ్యవహరించారు. ఈ చర్యలను బీఆర్‌ఎస్ పార్టీ బోధన్ పట్టణ శాఖ తీవ్రంగా ఖండించింది. మీడియా మిత్రులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని, ఇలాంటి దాడులు తిరగదిద్దాల్సిన అవసరం ఉందని రవీందర్ యాదవ్ పేర్కొన్నారు. ఈ హేయమైన చర్య పై, ఇసుక మాఫియా పై సబ్ కలెక్టర్, ఏసిపి చర్యలు తీసుకోవాలని, స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఈ ఘటనపై వెంటనే తగు సమగ్ర విచారణ చేపట్టి అక్రమ దారులపై చర్యలు తీసుకోవాలని  పార్టీ కోరింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ నాయకుడు మహమ్మద్ రజాక్, మాజీ ఫ్లోర్ లీడర్ బెంజర్ గంగారం, రేఖందాసు, ప్రవీణ్ జాదవ్, షేక్ జాకీర్ అహ్మద్, సాగర్, షేక్ మొహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.