వర్గీకరణను అడ్డుకోవాలని పిలుపునివ్వడాన్ని ఖండిస్తున్నాం
ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు నాంపల్లి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య నిజామాబాదులో జరిగిన సమావేశంలో వర్గీకరణను అడ్డుకోవాలని పిలుపునివ్వడాన్ని ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు నాంపల్లి ఖండించారు. నిజమైన అంబేద్కర్ వారసులు మాలలు అనే చెప్పుకుంటున్నా చిన్నయ్య సామాజిక న్యాయాన్ని కోరుకోలేనివారు అంబేద్కర్ వారసులు ఎట్లా అయితరో చెప్పాలని నాంపల్లి డిమాండ్ చేశారు. నిజమైన అంబేద్కర్ వారసులు షెడ్యూల్ కులాలలో ఉన్న 59 కులాలకు వారి జనాభా ప్రాతిపదికన సామాజిక న్యాయం కోరుకుంటారని నాంపల్లి తెలిపారు. నిజంగా...