Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 May 2025, 5:10 pm Posted by : ramakrishna

వర్గీకరణను అడ్డుకోవాలని పిలుపునివ్వడాన్ని ఖండిస్తున్నాం

  • ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు నాంపల్లి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య నిజామాబాదులో జరిగిన సమావేశంలో వర్గీకరణను అడ్డుకోవాలని పిలుపునివ్వడాన్ని ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు నాంపల్లి ఖండించారు. నిజమైన అంబేద్కర్ వారసులు మాలలు అనే చెప్పుకుంటున్నా చిన్నయ్య సామాజిక న్యాయాన్ని కోరుకోలేనివారు అంబేద్కర్ వారసులు ఎట్లా అయితరో చెప్పాలని నాంపల్లి డిమాండ్ చేశారు. నిజమైన అంబేద్కర్ వారసులు షెడ్యూల్ కులాలలో ఉన్న 59 కులాలకు వారి జనాభా ప్రాతిపదికన సామాజిక న్యాయం కోరుకుంటారని నాంపల్లి తెలిపారు. నిజంగా మీరు దళితుల సంక్షేమం కోరుకుంటే రిజర్వేషన్లు పెంచాలని రాజ్యాధికారంలో మా వాటా మాకు కావాలని కలిసి పోరాటం చేద్దాం రండి అని పిలుపునిచ్చారు.