- టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఉద్యోగులందరూ ఐకమత్యంగా ఉన్నప్పుడే సమస్యలన్నీ సాధించుకుంటామని ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టిఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ సూచించారు. ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్,టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ అధ్యక్షతన టీఎన్జీవో మెగా సభ్యత నమోదు కార్యక్రమం శనివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టిఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ మాట్లాడారు. ఉద్యోగులందరికీ సహాయ సహకారాల వలన నేడు ప్రభుత్వంతో ఉద్యోగుల సమస్యలు ఒకటొకటిగా పరిష్కారం చేసుకుంటున్నామని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశానుసారం ప్రతినెల 700 కోట్ల రూపాయల ఉద్యోగుల పెండింగ్ బిల్లులు పాస్ అవుతున్నాయని, దీనికి మనందరం ఐకమత్యంగా ఉండడమే నిదర్శమని తెలియజేశారు. ఉద్యోగుల సమస్యల కోసం నిరంతరం శ్రమిస్తున్న యువ నాయకుడు సుమన్ కుమార్ ను ఆదర్శంగా తీసుకొని, ప్రతి ఒక్కరూ సంఘం యొక్క ఔన్నత్యం పెంచుటకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, కేంద్ర కార్యవర్గ సభ్యులు మచ్చకూరి సతీష్ కుమార్, జిల్లా సహాధ్యక్షులు పెద్దోళ్ల నాగరాజు, చిట్టి నారాయణరెడ్డి, కోశాధికారి దినేష్ బాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు అతిక్, సునీత, మంజుల, శ్రీనివాస్, మాణిక్యం, జాఫర్ హుస్సేన్, శ్రీవేణి ,పద్మ, విజయలక్ష్మి, అన్ని యూనిట్ శాఖల అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, శశికాంత్ రెడ్డి, సృజన్ కుమార్, ప్రవీణ్ రాజ్, సూర్య ప్రకాష్, రాజశేఖర్, మారుతి విశాల్, సాయిలు, శ్రీనివాస్, సతీష్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
