Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 April 2026, 9:01 pm Posted by : ramakrishna

మేం భారతమాతకు బానిసలం . .  లిక్కర్ కు కాదు

 

. . . నిన్నటి వరకు పిట్టలదొర . . . ఇప్పుడు పిట్టలదొర సాని క్యారెక్టర్ చూస్తాం

 

. . . కవిత పార్టీపై ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యలు

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

తాము భారతమాతకు బానిసలమని లిక్కర్ కు కాదని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సేనను శనివారం ప్రారంభించిన నేపథ్యంలో ఎంపీ అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. కవితాను తామేప్పుడో మరిచిపోయామని అన్నారు. నిన్నటి వరకు పిట్టల దొర క్యారెక్టర్ అని ఇప్పుడు పిట్టల దొరకసారి క్యారెక్టర్ అని విమర్శించారు. టీఆర్ఎస్ హ్యాంగోవర్ తోనే కవిత బతుకుతున్నారని, అందుకే పార్టీకి టీఆర్ఎస్ పేరు పెట్టారన్నారు. బీజేపీ సపోర్టు లేకుండానే తెలంగాణ వచ్చిందా అని ప్రశ్నించారు. కవితకు రాజకీయ సమాది కట్టింది బీజేపీనే అన్నారు.