ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం
ప్రధాని మోదీ డిల్లీ, బతుకమ్మ : ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, అది మానవాళికి అతిపెద్ద ముప్పు అని మోదీ అన్నారు. భారత పర్యటనలో ఉన్న అంగోలా అధ్యక్షుడు జువా లోరెన్స్ తో ప్రధాని భేటీ అయ్యారు. అనంతరం వీరు సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా మోదీ పహల్గాం ఉగ్రదాడి ఘటనను ప్రస్తావించారు. సీమాంతర ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతు పలికినందుకు అంగోలా దేశానికి ధన్యవాదాలు తెలిపారు. ఉగ్రవాదులు, వారికి మద్దతు ఇచ్చే వారిపై కఠినమైన, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడానికి మేం...