Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 June 2026, 9:40 pm Posted by : ramakrishna

సామాజిక తెలంగాణ ఏర్పాటే లక్ష్యం గా ప్రజల్లోకి వస్తున్నాం

 

. . . టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు సంపత్ గౌడ్

 

లింగంపేట, బతుకమ్మ :

 

రాష్ట్రంలో సామాజిక తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా  తెలంగాణ రక్షణ సేన ( టిఆర్ఎస్) పార్టీతో ప్రజల్లోకి వస్తున్నామని, ప్రజలంతా ఆశీర్వదించి అధికారం కట్ట బెట్టాలని ఆ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్య క్షులు, ఎల్లారెడ్డి నియోజక వర్గ ఇన్చార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ అన్నారు. టిఆర్ఎస్ జెండా పండుగను పురస్కరించుకుని శుక్రవారం ఆయన ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, తాడ్వాయి, గాంధారి, సదాశివ నగర్, రామారెడ్డి మండలాల్లో తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండాల ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన లింగంపేట మండల కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్, చాకలి ఐలమ్మ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల పేరిట పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన టిఆర్ఎస్ పార్టీ, ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం చేయాలనే సంకల్పంతో  కల్వకుంట్ల కవిత తెలంగా ణ రక్షణ సేన( టిఆర్ఎస్ ) పార్టీని స్థాపించినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు మాకు అధికారం కట్టబెడితే కార్పొరేట్ స్థాయిలో  ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని, రాష్ట్రంలో నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ సమస్యను తీరుస్తామని వెల్లడించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియో జకవర్గంలోని అన్ని స్థానాలను టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుని కవితక్కకు గిఫ్ట్ ఇద్దామని ఆయన అన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అబ్జర్వర్ కోల శ్రీనివాస్, రాష్ట్ర నాయకురాలు డాక్టర్ వరలక్ష్మి, జిల్లా మహిళా అధ్యక్షురాలు వసంత, కామారెడ్డి జుక్కల్ నియోజకవర్గాల ఇన్చార్జిలు గైని శ్రీనివాస్, రాజశేఖర్, కామారెడ్డి యూత్ అధ్యక్షుడు ఆదిల్, లింగం పేట మండల అధ్యక్షుడు పోకల సాయిరాం, ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు జైల్ సింగ్, నాయకులు శ్రీకాంత్, మామిళ్ల రాజు, పరంధాములు యాదవ్, రమేష్ రాథోడ్, బోర్గి సంజీవులు, రాపర్తి మహేందర్ తో పాటు వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

 

We are reaching out to the people with the goal of establishing a socially equitable Telangana.