అర్హులైన లబ్దిదారులకు అందరికి ఇల్లు అందజేస్తున్నాం

  . . . కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్   నిజాంసాగర్, బతుకమ్మ :   అర్హులైన లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అన్నారు. శుక్రవారం నిజాంసాగర్ మొహమ్మద్ నగర్ మండలాలలోని గాలిపూర్, అచ్చంపేట్ గ్రామలాల్లో నూతన ఇందిరమ్మ ఇళ్లను ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క లబ్ధిదారులకు సంక్షేమ పథకమందే విధంగా చూస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు....