Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 September 2025, 8:53 pm Posted by : ramakrishna

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మేము పాల్గొనడం లేదు

  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

 

హైదరాబాద్, బతుకమ్మ : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తాము పాల్గొనడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు కొట్టుకుంటున్నారు. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ఈ రాష్ట్ర రైతాంగాన్ని వేధిస్తున్నారు. 20 రోజుల కిందట మేము హెచ్చరించినా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. రాష్ట్రప్రభుత్వం స్పందించలేదు. అందుకే 70 లక్షల రైతన్నల తరుపున మేము ఎన్నికలు బహిష్కరించాం. మేము ఎన్డీఏ సబార్డినేట్ కాదు, ఇండియా సబార్డినేట్ కాదు.. మేము తెలంగాణ ప్రజల సబార్డినేట్. కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన వారి బాధను తెలియజేయడానికి దీన్ని ఒక వేదికగా వాడుకుంటూ.. రైతుల పక్షాన ఈ ఎన్నికల్లో మేము పాల్గొనడం లేదు. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు కొట్టుకుంటున్నారు. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ఈ రాష్ట్ర రైతాంగాన్ని వేధిస్తున్నారు. తెలంగాణ ప్రజల పక్షాన వారి బాధను తెలియజేయడానికి దీన్ని ఒక వేదికగా వాడుకుంటూ. రైతుల పక్షాన ఈ ఎన్నికల్లో మేము పాల్గొనడం లేదు’’ అని తెలిపారు.