Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 January 2025, 7:41 pm Posted by : ramakrishna

ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం

  • కాంగ్రెస్ నాయకులు అగ్గు భోజన్న

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని కాంగ్రెస్ నాయకులు అగ్గు భోజన్న అన్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు అగ్గు భోజన్న మాట్లాడారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అభివృద్ధి పనులతో పాటు  హామీలను అమలు చేస్తుందన్నారు. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న రేషన్ కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ సంక్షేమ పథకాలను అందించి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందన్నారు. పథకాలను అందించాలనే ఉద్దేశంతోనే  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనతో ప్రజల ముందుకు వచ్చిందన్నారు. నాలుగు పథకాలను అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై  ధీమాతో ఉన్నారన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో  ఎమ్మెల్యే భూపతి రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 13 నెలల కాలంలోనే  10 కోట్ల రూపాయలతో 58  అభివృద్ధి పనులు జరిగాయని ఆయన అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన ఆరోపించారు.