Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 September 2024, 11:55 am Posted by : ramakrishna

‘జీవదాన్’ అల్లర్లను ప్రేరేపించిన వ్యక్తులను గుర్తిస్తున్నాం

. పాఠశాల ఆస్తుల ధ్వంసం, పోలీసులపై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు

. పీఈటీ నాగరాజు పై  బీఎంఎస్, ఫోక్సో కేసులు నమోదు, రిమాండ్

.  సోషల్ మీడియాలో అసత్య ప్రచారం  చేసిన ఇద్దరిపై కేసులు

. కామారెడ్డి  ఎస్పీ సింధూశర్మ వెల్లడి

కామారెడ్డి , బతుకమ్మ: జిల్లా కేంద్రంలోని జీవదాన్ స్కూల్ లో చోటు చేసుకున్న ఘటన దురద్రుష్టకరమని, దీనికి కారణమైన పీఈటీ నాగరాజు పై  బీఎంఎస్, పోక్సో కేసు లు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని ఎస్పీ సింధూశర్మ తెలిపారు. బుధవారం ఎస్పీ సింధూ శర్మ శర్మ విలేకరులతో మాట్లాడారు. సెప్టెంబర్ 23న అందిన ఫిర్యాదు మేరకు పీఈటీపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. నిందితుడికి కఠిన శిక్షపడేలా చూస్తామన్నారు. స్కూల్  వద్ద జరిగిన గొడవలో సీఐ చంద్రశేఖర్ రెడ్డితోపాటు నలుగురు పోలీసులు గాయపడ్డారన్నారు. అల్లర్లను ప్రేరేపించిన వ్యక్తులను గుర్తిస్తున్నామని, పాఠశాల ఆస్తుల ధ్వంసం, పోలీసులపై దాడి చేసిన వ్యక్తులను కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. బాలికపై ఎలాంటి భౌతిక గాయాలు లేవన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేశామని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలు నమొద్దన్ని ఎస్పీ సింధూశర్మ కోరారు.