. . . జిల్లా బిజేపి అధ్యక్షులు దినేష్ కులచారీ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా జిల్లా పరిషత్‌పై కాషాయ జెండా ఎగురవేయబోతున్నాం” ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి ఒక్క కార్యకర్త పట్టుదలతో పనిచేయాలని నిజామాబాద్ బిజేపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారీ అన్నారు. బిజెపి నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో నిజామాబాద్ రూరల్ మండల కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ముఖ్య అతిథిగా హాజరై రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, విజయానికి కృషి చేయాల్సిన విధానాలపై ఆయన కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు.మన వార్డులో, మన గ్రామంలో, మన మండలంలో బీజేపీ పార్టీ అభ్యర్థి గెలిస్తేనే మన పార్టీ మరింత బలోపేతం అవుతుంది” అని ఆయన అన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచులుగా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదు అన్నారు.ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ లను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని, కేవలం మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ వైఖరి పట్ల ప్రజలు, మహిళలు, రైతులు తీవ్ర నిరాశతో ఉన్నారని, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి వారంతా సిద్ధంగా ఉన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాము మద్దతుగా ఉండాలనే విశ్వాసంతో ప్రజలందరూ ఉన్నారని, అందుకే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ గెలిపించాలని కోరుకుంటున్నారు.ఈ సమావేశంలో పద్మరెడ్డి,జగన్ రెడ్డి, చింత శ్రీనివాస్ రెడ్డి, రవి,గోపి,బిలోజి నాయక్, ఆనంద్, సందీప్,తదితరులు పాల్గొన్నారు