ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే అమలు చేస్తున్నాం
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే అమలు చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. నిజామాబాద్ పట్టణంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిజామాబాద్ అర్బన్ నియోజక వర్గంలోనీ పలు కాలనీల లోని బాధితులకు సీఎం సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేయించడం జరిగింది అన్నారు. అనారోగ్యంతో అప్పుల పాలైన వారికి...