Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 June 2025, 5:19 pm Posted by : ramakrishna

ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే అమలు చేస్తున్నాం

  • ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే అమలు చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. నిజామాబాద్ పట్టణంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిజామాబాద్ అర్బన్ నియోజక వర్గంలోనీ  పలు కాలనీల లోని బాధితులకు సీఎం సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేయించడం జరిగింది అన్నారు. అనారోగ్యంతో అప్పుల పాలైన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎంతో కొంత  ఉపశమనం కలిగిస్తాయని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు అర్హులకు అందిస్తామని తెలిపారు. రుణమాఫీ చేసి చూపించాం.. రైతు భరోసా అందిస్తున్నామని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని అన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా నిరుద్యోగ యువకులు స్వయం ఉపాధి దక్కుతుందన్నారు.

We are delivering more than what we promised.