Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 June 2025, 7:59 pm Posted by : ramakrishna

ట్యాంకర్ల ద్వారా పంట పొలాలకు నీరు

బతుకమ్మ, భిక్కనూరు: భూగర్భ జలాలు తగ్గడం, బోర్లు ఎండిపోతుండడంతో అన్నదాతలు తల్లాడిల్లీ పోతున్నారు. ఎండిపోతున్న పంటను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. పంటలను ఎండబెట్టుకోలేక ఒక రైతు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నాడు. మంగళవారం భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో రైతు ఆముదాల రమేష్ 5 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని మొక్కజొన్న విత్తనాలు నాటినట్లు తెలిపారు. విత్తనాలు నాటి మొలకలు వచ్చాయని 15 రోజులు గడుస్తున్నా వర్షాలు కురువకపోవడంతో చిన్నగా మొలకెత్తిన మొక్కజొన్నను కాపాడుకునేందుకు ట్యాంకర్ ద్వారా నీటిని తీసుకువచ్చి మొక్కలకు పోస్తున్నట్టు తెలిపారు. ఈ వర్షాకాలం వరుణుడు కరుణించకపోతే రైతులకు ఉరే గతని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Water to crop fields through tankers