Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 August 2025, 3:10 pm Posted by : ramakrishna

రేపు శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ నుంచి కాలువలకు నీటి విడుధల

 

మెండోరా, బతుకమ్మ :

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు  ఆయకట్టు పరిధిలోనీ వానాకాలం పంటకు సాగునీరు అందించేందుకు గురువారం నీటి విడుధల ప్రారంభిస్తున్నట్టు ఇరిగేషన్ సర్కిల్ పోచంపాడ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీనివాసరావు గుప్త తెలిపారు. ప్రాజెక్ట్ ప్రణాళిక పై తెలంగాణ నీటిపారుదల శాఖ    ఆధ్వర్యంలో -రాష్ట్రస్థాయి సమీకృత నీటి ప్రణాళిక యాజమాన్య కమిటీ సమావేశం నిర్ణయం ప్రకారం ఈ నెల 7న  కాకతీయ , లక్ష్మీకాల్వలకు  సాగు నీరు విడుదల ఉదయం 11గంటలకు ప్రారంభమవుతుంది అని తెలిపారు. ఈ విషయంలో రెవిన్యూ, పోలిస్, అధికార యంత్రాంగాలను అప్రమత్తం చేసినట్టు తెలిపారు.