Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 7:20 pm Posted by : ramakrishna

గురువారం  నగరంలో నీటి సరఫరా నిలిపివేత

 

. . . పైపులైన్ మరమ్మతుల తో నీటి సరఫరాకు అంతరాయం

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

అలీ సాగర్‌ ఫీడర్‌ పైపులైన్‌కు సంబంధించి రైల్వే కమాన్‌ వద్ద 500 ఎంఎం డయా ఎంఎస్‌ పైపులైన్‌ మరమ్మతు పనులు చేపడుతున్న నేపథ్యంలో గురువారం నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుంది నగర ప్రజలు సహకరించాలని నిజామాబాద్‌ నగరపాలక సంస్థ కమీషనర్ దిలీప్ కుమార్ కోరారు.  పైప్ లైన్ కు మరమ్మతులు పనుల కారణంగా ఈ నెల 5న నగరంలోని నాందేవాడ, హమల్వాడి, సుభాష్‌నగర్‌, ఆదర్శనగర్‌, గౌతమ్‌నగర్‌, దుబ్బ, ఖలీల్ వాడి, ఎల్లమ్మగుట్ట, కంటేశ్వర్‌, చంద్రశేఖర్‌ కాలనీ, గంగాస్థాన్‌, ఇస్లాంపుర కాలనీ, అశోక్‌నగర్‌, వినాయకనగర్‌ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. పైపులైన్‌ మరమ్మతు పనులకు నగర ప్రజలు సహకరించాలని కోరారు.

Water supply to be suspended in the city on Thursday