. . . మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు లీకేజీ
. . . మున్సిపల్ కమీషనర్ గోవు గంగాధర్ వెల్లడి
బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ పట్టణంలో మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్‌కు లీకేజీ ఏర్పడింది. దీంతో నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడనుంది. భగీరథ పైప్‌లైన్‌కు లీకేజీ ఏర్పడడంతో తాగునీటి సరఫరాను మూడు రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేసినట్లు మున్సిపల్ కమిషనర్ గంగాధర్ తెలిపారు. పైపులైన్ మరమ్మతు పనులు జరుగుతున్న నేపథ్యంలో పట్టణ ప్రజలు తాగునీటి అవసరాల కోసం స్థానికంగా ఉన్న మున్సిపాలిటీ బోర్లను వినియోగించుకోవాలని సూచించారు. మరమ్మతు పనులు పూర్తయిన వెంటనే యథావిధిగా మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సరఫరాను పునరుద్ధరిస్తామని కమిషనర్ వెల్లడించారు. ప్రజలు సహకరించి, నీటిని పొదుపుగా వినియోగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
