Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 September 2025, 5:33 pm Posted by : ramakrishna

బోధన్‌లో నీటి సరఫరాకు అంతరాయం

బతుకమ్మ బోధన్ : బోధన్‌ పట్టణంలోని శకర్‌నగర్, మరియా హౌసింగ్ ప్రాంతాలకు ఈ నెల 16వ తేదీ (మంగళవారం) నీటి సరఫరా నిలిచిపోనుంది. మిషన్‌ భగీరథ 200 మిల్లీమీటర్ల పైప్‌లైన్‌ లీకేజీ మరమ్మత్తు పనుల కారణంగా ఆ రోజు నీటి సరఫరా తాత్కాలికంగా నిలిపివేయనున్నట్టు పురపాలక సంఘం కమిషనర్ జాదవ్ కృష్ణ తెలిపారు.  ప్రజలు సహకరించాలని కోరారు.