Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 5:46 pm Posted by : ramakrishna

నీటిని పొదుపుగా వాడుకోవాలి

 

రుద్రూర్ బతుకమ్మ :

 

ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బాల వికాస్ సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం  ప్రపంచ నీటి దినోత్సవాన్ని నిర్వహించారు. పాఠశాల విద్యార్థినీలతో ర్యాలీ నిర్వహించి, నీటి ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బాలవికాస ప్రతినిధి సాయరెడ్డి మాట్లాడుతూ.. నీటిని వృధా చేయకుండా ప్రతి నీటి చుక్కను పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.