- డిఎల్పిఓ, మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్
బతుకమ్మ భిక్కనూరు: వేసవికాలంలో గ్రామాలలో నీటి కష్టాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, నీరు తక్కువ వస్తున్న బోర్లను గుర్తించి ప్రత్యామ్నాయంగా మరో చోటు నుండి బోరు కనెక్షన్ ఇవ్వాలని డి ఎల్ పి ఓ, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. శుక్రవారం మండలంలోని పెద్ద మల్లారెడ్డి, గుర్జకుంట, అంతంపల్లి గ్రామాలలో నర్సరీ, అవెన్యూ ప్లాంటేషన్, సానిటేషన్, కంపోస్ట్ షెడ్, ఫ్రైడే డ్రై డే, క్రిమిటోరియం, గ్రామ పంచాయతీ టాక్స్ కలెక్షన్ రికార్డులు పరిశీలించారు. నర్సరీలో మొక్కలు ఎండిపోకుండా ప్రతిరోజు నీళ్ళు పోయాలని, ప్రజా సమస్యలు గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు లక్ష్మి, బాలకృష్ణ, మండల పరిషత్, గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు ఉన్నారు.