Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 October 2026, 11:32 am Posted by : ramakrishna

ఎస్ఆర్ఎస్పీ నుంచి కాకతీయ ప్రధాన కాలువకు నీటి విడుదల

 

 బాల్కోండ, బతుకమ్మ:

ఎలినినో ప్రభావం వల్ల వర్షాలు లేకపోవడంతో పంట సాగు కోసం శ్రీరాం సాగర్ నుంచి నీటి విడుదల చేశారు ప్రాజెక్టు అధికారులు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం ఉదయం కాకతీయ ప్రధాన కాలువ (ఎల్ఎండి ఎగువన) ఆయకట్టు కోసం 2000 క్యూసెక్కుల తో సాగు నీటిని విడుదల చేశారు. ఆ తర్వాత నీటి విడుదల క్రమంగా పెంచబడుతుంది అని ఇరిగేషన్ సర్కిల్ పోచంపాడు సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎ.జగదీష్ తెలిపారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో తగినంత  నీటి నిలువ లేనందువల్ల విడుదల చేసిన నీటిని రైతు లు సక్రమంగా,పొదుపుగా వాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్ట్ లో 80.05 టీఎంసీలకు గాను 45.459 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ భాగం నుంచి ఎన్ ప్లో రావడం లేదని 2132 క్యూసెక్కులు ఔట్ ఫ్లో కొనసాగుతుందన్నారు.