16 గేట్ల ద్వారా నీటి విడుదల
మెండోరా, బతుకమ్మ: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 16 గేట్లు ఎత్తి 49280 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి కొనసాగుతున్నట్లు ప్రాజెక్ట్ డి ఈ ఈ గణేష్ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 78000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ఇదిలా ఉండగా ప్రాజెక్ట్ ప్రధాన కాలువలైన వరద కాలువ ద్వారా 20000 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 6500 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 1500 క్యూసెక్కులు, లక్ష్మీ కాల్వ ద్వారా 150 క్యూసెక్కులు, 231...