బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో నీటి సమస్య నివారించాలని ఆర్టిఐ జిల్లా ప్రతినిధి గంగుల రవీందర్ అన్నారు. శుక్రవారం గ్రామపంచాయతీ సెక్రెటరీ మహేష్ గౌడ్ కు నీటి సమస్య పై వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత కొంతకాలం నుండి నీటి సమస్య ఎదుర్కొంటున్నామని ఏ అధికారి పట్టించుకోవడంలేదని వారు ఆరోపించారు. ఇకనైనా మా కాలనీలో నీటి సమస్య తీర్చాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాగరాజు యాదమ్మ లావణ్య సుశీల ఉన్నారు.