చివరి ఆయకట్టుకు అందని నీరు..

 ఆందోళనలో అన్నదాతలు..   బాన్సువాడ, బతుకమ్మ  : నిజాంసాగర్ చివరి ఆయకట్టు తడారిపోతోంది.. వేసవికి ప్రారంభంలోనే నీరందక తల్లడిల్లుతోంది. తలాపున నీళ్లున్న తమ పొలాలకు పూర్తిగా నీళ్లందక కర్షకుల కళ్లల్లో నీళ్లు వస్తున్నాయి. కాలువల ద్వారా సరిపడా నీరు రాకపోవడం.. ఎగువభాగంలో మోటార్లు పెట్టి నీళ్లు తోడేస్తుండడం కారణంగా.. చివరిగా ఉన్న భూములన్నీ బీళ్లుగా మారుతున్నాయని రైతన్న ఆవేదన చెందుతున్నారు. అధికారుల పర్యవేక్షణాలోపం తమకు శాపంగా మారిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజాంసాగర్ నిండుకుండలా ఉన్నప్పటికీ చివరి ఆయకట్టుకు నీరందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి....