మానేరు జలాశయాల్లో భారీగా తగ్గిన నీటి నిల్వలు
. . . ఖరీఫ్ సీజన్ వేళ సాగు, తాగునీటి అవసరాలపై పెరుగుతున్న భయం కరీంనగర్, బతుకమ్మ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రధాన జలవనరులైన మానేరు జలాశయాల్లో నీటి నిల్వలు భారీగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో నీటి లభ్యత తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అప్పర్ మానేరులో మొత్తం సామర్థ్యం 2 టీఎంసీలు ఉండగా, కేవలం 0.661 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. అలాగే మిడ్ మానేరులో 27.5...