Date of Publish : 02 September 2024, 1:19 amPosted by : ramakrishna
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలోకి నీరు..
సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పోలీసులు బతుకమ్మ భిక్కనూరు.. భిక్కనూరు మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లోకి ఉదయం నుండి కురుస్తున్న వర్షానికి నీరు రావడంతో డబుల్ బెడ్ రూమ్ లో నివసిస్తున్న వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న భిక్కనూరు ఎస్సై సాయి కుమార్ వారి సిబ్బందితో చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు అందులో ఉన్న వారిని గ్రామంలోని ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలకు తరలించారు.వీరికి గ్రామ మాజీ ఎంపీటీసీ మధ్య చంద్రకాంత్ రెడ్డి భోజన వసతి కల్పించారు.భిక్కనూరు వైద్య సిబ్బంది వారికి మందులను అందజేశారు.