బోరుబావి నుంచి పొంగుతున్న నీరు
నాగిరెడ్డి పేట్, బతుకమ్మ : నాగిరెడ్డిపేట మండలంలోని బంజారా తండా కు చెందిన దారావత్ అంబ్రా నాయక్ అనే వ్యక్తికి చెందిన బోరు బావిలో వర్షాలు బాగా పడడంతో బోరు బావి నుండి నిరంతరంగా నీరు పొంగిపొర్లుతోంది. ఈ దృశ్యం స్థానిక ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తుండగా, కొందరు రైతులు దీన్ని దేవుని దయగా భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో భూగర్భ జలాలు పెరగి, కొన్ని ప్రాంతాల్లో బోరు బావులలో నీటి ఒత్తిడి పెరిగింది. అందువల్ల ఆ బావి కేసింగ్ పైభాగం...