నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ కి వాటర్ డిస్పెన్సెర్లను న్యాయవాది జె వి ఆర్ బాబు తన తండ్రి స్వర్గీయ లక్ష్మీరాజ్యం(పూర్వ న్యాయవాది) తల్లి అనసూయ జ్ఞాపకార్థం అందజేశారు. నిజామాబాద్ జిల్లా కోర్టు ఆవరణంలోని బార్ అసోసియేషన్ హాల్ లో బుధవారం వాటర్ డిస్పెన్సర్లను జిల్లా జడ్జి సునీతా కుంచాల, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సంధర్భంగా జిల్లా జడ్జి సునీతా కుంచాల మాట్లాడుతూ న్యాయవాది బాబు వాటర్ డిస్పెన్సర్స్ అధించడం అభినదనీయమని అన్నారు. వేసవి కాలంలో బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సౌకర్యాన్ని కక్షిదారులు, న్యాయవాదులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. న్యాయవాది జేవిఆర్ బాబు తన తండ్రి స్వర్గీయ లక్ష్మీరాజ్యం(పూర్వ న్యాయవాది) తల్లి అనసూయ జ్ఞాపకార్థం జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ కి నాలుగు వాటర్ డిస్పెన్సెర్ డొనేట్ చెయ్యడం ఎంతో అభినందనీయమని బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ న్యాయవాది జె వి ఆర్ బాబు.కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి వసంత్ రావు, న్యాయవాది జేవీఆర్ బాబు, చార్టెడ్ అకౌంటెంట్ సవిత, సీనియర్ అడ్వకేట్స్ ఆర్.జగదీశ్వర్ రావు, కిరణ్ కుమార్ గౌడ్, ఆర్ రాజలింగం, కృపాకర్ రెడ్డి, రాజ్ కుమార్, సుబేదర్ విశ్వక్ సేవ్ తదితరులు పాల్గొన్నారు.
