Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 September 2024, 3:12 pm Posted by : ramakrishna

ఐదు గేట్ల ద్వారా నీటి విడుదల

బతుకమ్మ,మెండోరా: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి ఎగువ ప్రాంతాల్లో నుంచి 42 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండడంతో ప్రాజెక్ట్ అధికారులు ఎస్సారెస్పీ ఐదు గేట్లా ను ఎత్తి 42 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిగా నిండిపోవడంతో జలకల సంతరించుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు కాగా ప్రస్తుతం 1090 అడుగులుగా ఉంది. ఈ జల దృశ్యాలను చూడడానికి పర్యాటకులు వస్తున్నారు.