Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 8:55 pm Posted by : ramakrishna

నీటి సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత

 

. . . మున్సిపల్ కమీషనర్ గోవు గంగాధర్

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

నీటి సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని మున్సిపల్ కమిషనర్ గోవు గంగాధర్ అన్నారు. మున్సిపల్  ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నీరు అమూల్యమైన సహజ వనరు అని, ప్రతి నీటి బొట్టును పొదుపుగా వినియోగించాలని సూచించారు. ఇంట్లో పాఠశాలలో అవసరమైనంత మేరకే నీటిని ఉపయోగించడం లీకేజీలను వెంటనే మరమ్మతు చేయించడం వర్షపు నీటి సంరక్షణ చేపట్టడం, చెట్లు నాటడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించడం చెరువులు, కాలువలు మరియు ఇతర నీటి వనరులను పరిశుభ్రంగా ఉంచడం వంటి అంశాలపై విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు తమ ఇళ్లలో, పాఠశాలల్లో మరియు పరిసర ప్రాంతాల్లో నీటిని వృథా కాకుండా చూసుకోవడంతో పాటు, ప్రజల్లో కూడా నీటి సంరక్షణపై అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమం ముగింపులో విద్యార్థులు నీటిని సంరక్షిస్తామని, ప్రతి నీటి బొట్టు విలువను గుర్తించి బాధ్యతాయుతంగా వినియోగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో  పాఠశాల ప్రదనోపాధ్యాయురాలు వాణి, ఉపాధ్యాయులు 13వ వార్డ్ కౌన్సిలర్ ఖాలేక్, కో సభ్యులు కమర్ సుల్తానా గౌస్ పాషా , పురపాలక సిబ్బంది,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

 

Water conservation is the responsibility of every citizen.